హీరో శ్రీవిష్ణు నటిస్తున్న మరో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘గాలి సంపత్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనీష్ కృష్ణ గతంలో ‘అలా ఎలా, లవర్’ వంటి చిత్రాలకు డైరెక్టర్‌గా పనిచేశారు. అనిల్ రావిపూడి సినిమాకు కో డైరెక్టర్ పనిచేస్తున్నారు. రైటర్ గా చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్నారు. ఆయనతో పాటు సాహు గారపాటి, హరీశ్పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లవ్ లీ సింగ్ హీరోయిన్. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ‘గాలి సంపత్’ గా శ్రీవిష్ణుకు తండ్రిగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టారు. నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో హీరోయిన్లపై షూట్ చేసిన మొదటి సీన్ కు వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించారు.
- November 16, 2020
- Archive
- Top News
- సినిమా
- DILRAJU
- GAALISAMPATH
- LOVELYSINGH
- SRIVISHNU
- అనిల్ రావిపూడి
- గాలి సంపత్
- దిల్‌రాజు
- లవ్లీసింగ్
- శ్రీవిష్ణు
- Comments Off on ‘గాలి సంపత్’.. షూటింగ్ షురూ