ఎయిర్ ఫోర్స్, పూలవర్షం
– వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు, వైరస్ బారినపడిన రోగులకు నిరంతరం సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి ఎప్పటికీ మరువలేనిది.
ఈ నేపథ్యంలో హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాంధీ ఆస్పత్రిపై ఆదివారం (ఏప్రిల్ 3న) ఉదయం 9.30 గంటలకు పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు.
వైరస్ నియంత్రణ చర్యల్లో పాలుపంచుకున్న ఈ విషయంపై త్రివిధ దళాధిపతులు శుక్రవారం చర్చించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు, నర్సులు, తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టిరీయల్, పారామెడికల్, నాలుగవ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరుకావాలని కోరారు.
పూర్తి యూనిఫాంలో హాజరైన సందర్భంలో వారిపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ణయించారు.