సారథి న్యూస్, హైదరాబాద్: గవర్నర్ తమిళ్సై సౌందర్‌రాజన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అనంతరం తమిళ్సై బాబాయ్ మృతిచెందడంతో ముఖ్యమంత్రి పరామర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు వసంత కుమార్ కరోనాతో ఇటీవల కన్నుమూసిన తెలిసిందే. వసంత కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహణ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన గవర్నర్ తమిళ్సై సౌందర్‌రాజన్ కు స్వయాన బాబాయ్ అవుతారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
- August 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- GOVERNER TAMILISAI
- TELANGANA
- గవర్నర్తమిళ్సై
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ