Breaking News

గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

  • నవంబర్​ 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం
  • భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి
  • కలెక్టర్లను ఆదేశించిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌


సారథి న్యూస్, కర్నూలు: పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ తుంగభద్ర నదీ పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడ నుంచి జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కర్నూలు జిల్లా పరిధిలో తుంగభద్ర నదిపై పాత 16 ఘాట్లతో పాటు కొత్తగా ఆరు ఘాట్ల నిర్మాణ పనులపై రాష్ట్రస్థాయి సమావేశంలో అనుమతి ఇచ్చారని, అందులో భాగంగా రివైజ్డ్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను బుధవారం సాయంత్రంలోగా పంపించాలన్నారు.
పుష్కర ఘాట్లు, మౌలిక సదుపాయాలను పారదర్శకంగా, నాణ్యవంతంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో తక్కువ ఘాట్లలో ఎక్కువ మంది రాకుండా చూసుకోవాన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందుగా బళ్లారి, రాయిచూర్ ​కలెక్టర్‌, ఎస్పీ, సంబంధిత అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటేషన్‌, పవర్‌ సప్లై, పోలీస్‌ బందోబస్తు, హెల్త్‌, సేఫ్టీ, ట్రాఫిక్‌ కంట్రోల్‌, ట్రాన్స్​పోర్ట్, అకామిడేషన్‌ తదితర వాటిని ప్రాపర్‌ గా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.