తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్ఆర్ ప్రభు, ఎన్ఆర్ ప్రకాశ్‌బాబు తెలిపారు. ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికీ నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి లోకేశ్ కనరాజ్ దర్శకత్వం వహించగా.. కార్తీ హీరోగా నటించారు. ఈ చిత్రం అప్పట్లోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.