Breaking News

కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత

కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత


సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీ వరద నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు షట్టర్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వచ్చే కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ముందస్తు చర్యగా అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.