Breaking News

కొనసాగుతున్న హరితహారం

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్​రావు, ఏపీవో చంద్రశేఖర్​, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్​ శేఖర్, దొడ్డ లచ్చిరెడ్డి, సెక్రటరీ అనీల్​ పలువురు రైతులు పాల్గొన్నారు.