సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. శనివారం కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3048కు చేరింది. కొత్తగా వచ్చిన కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో 152 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.
మిగిలిన కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో ఐదు, యాదాద్రిలో ఐదు, మహబూబ్‌నగర్‌లో నాలుగు, మహబూబాబాద్‌లో ఒకటి, జగిత్యాలలో రెండు, కరీంనగర్‌లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి, వికారాబాద్‌లో ఒకటి, జనగామలో ఒకటి, నాగర్‌కర్నూల్‌లో రెండు, జోగుళాంబ గద్వాలలో ఒకటి, నల్గొండలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. చికిత్స తీసుకుని నయం అయిన కరోనా కేసులు 1710 ఉన్నాయి. కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 123 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 1663గా నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.