Breaking News

కొట్రలో కమ్యూనిటీ హాల్ ​ప్రారంభం

కొట్రలో కమ్యూనిటీ హాల్​ప్రారంభం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతన నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ ​భవనం)ను కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్ ​శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ ​బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలకు ఎన్నో అవకాశాలు కల్పించేలా కష్టపడి రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్​తెలంగాణకు సీఎం కావడం వరమన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కొట్రలో రూ.రెండు కోట్ల వ్యయంతో విద్యుత్​ సబ్​స్టేషన్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి రైతాంగానికి ఇక కరెంట్ ​సమస్యే ఉండదన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ ​ప్రారంభించారు. కార్యక్రమంలో వెల్దండ ఎంపీపీ విజయ, కొట్ర సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​రావు, ఎంపీటీసీ రాములు, మాజీ వైస్​ఎంపీపీ వెంకటయ్యగౌడ్, టీఆర్ఎస్ ​రాష్ట్ర కార్యదర్శి గోలి శ్రీనివాస్​రెడ్డి, ఎస్సై నర్సింహా, వార్డు సభ్యులు కె.హరిశ్చంద్రప్రసాద్, శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ​పి.జంగయ్య, సీనియర్​ నాయకులు కడారి కృష్ణయ్య, స్థానిక అంబేద్కర్ ​యువజన సంఘం నాయకులు కె.రాములు, బి.మల్లేష్, కె.క్రాంత్, కె.బాల్​రాజు, టి.వెంకటయ్య, పి.కృష్ణయ్య, బి.రామస్వామి, కె.పర్వతాలు, టీఆర్​ఎస్​ గ్రామాధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు.