Breaking News

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కేజీఎఫ్’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాదు దేశవ్యాప్తంగా అందరిచూపులను మూవీ సీక్వెల్ వైపు తిప్పుకుంది. మొదట ఈ సీక్వెల్ విడుదల ఈ ఏడాది అక్టోబర్‌లో అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వర్క్ కు బ్రేక్ పడడంతో ప్రకటించిన తేదీకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కొత్త అప్ డేట్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్ర సమర్పకులు, ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో విషెస్ చెప్పిన ప్రశాంత్ నీల్‌.. నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు బదులుగా అతిత్వరలోనే అప్ డేట్ రాబోతోందని ప్రకటించాడు. లాస్ట్ ఇయర్ సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 29న ‘అధీర’గా తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ‘కేజీఎఫ్‌ 2’ టీమ్. ప్రశాంత్ నీల్ తాజా ప్రకటనను బట్టి ఈసారి బర్త్ డేకు కూడా టీజర్ లేదా మరేదైనా ప్రమోషనల్‌ కంటెంట్‌ను విడుదల చేయబోతున్నట్టు అర్థమవుతోంది. హీరో రాఖీభాయ్, అధీర క్యారెక్టర్స్ మధ్య ఉండే ఆసక్తికరమైన పోరు ‘కేజీఎఫ్‌ 2’ స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి రాబోయే ఆ అప్‌డేట్‌ ఏదైనా సరే ప్రేక్షకులకు సర్​ప్రైజింగ్​గానే ఉంటుంది.