Breaking News

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం కేజీఎఫ్​2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్​ కూడా రాధేశ్యామ్​తో పాటు మహానటి ఫేమ్​ నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్​ చేశాడు. ఈ రెండు పూర్తయ్యాక ప్రశాంత్​ నీల్​ చిత్రం ప్రారంభించే అవకాశం ఉంది.