సారథి న్యూస్, రామడుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గద్దె దిగాలని కరీంనగర్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిశేఖర్ విమర్శించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు అన్న మోడీ, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట తప్పినందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి అంజన్న గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు దేవకిషన్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు నేరెళ్ల రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి బాపు రాజు పాల్గొన్నారు.
- August 9, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BC CELL
- BJP
- CONGRESS
- KARIMNAGAR
- కాంగ్రెస్
- బీజేపీ
- బీసీసెల్
- Comments Off on కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెదిగాలి