Breaking News

కేంద్రపథకాలపై ప్రచారం

BJP

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రపథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాగర్​కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీప్ ఆచారి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అందిస్తున్నా.. వాటిని సద్వనియోగం చేసుకోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణ చారి , బిజినేపల్లి మండల అధ్యక్షుడు గుమ్మకొండ భూషయ్య తదితరులు పాల్గొన్నారు