Breaking News

కూలీలకు మస్తు డిమాండ్

సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్​ ఏర్పడింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు ఇస్తున్నారు. ముందుగా కూలీల సంఘం నాయకులకు అడ్వాన్స్​గా కొంత నగదు చెల్లించి కూలీకి తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలో కూలీలకొరత అధికంగా ఉండటంతో కొంతమంది పెద్ద రైతులు సాంకేతిక ఆధారంగా వరి నాటు యంత్రాల సహాయంతో నాట్లు వేస్తున్నారు.