సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరుశరామ్ కాంబినేషన్ల ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరుశరామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ సినిమా ఓకే చేశారట. అధికారికంగా ప్రకటించినా ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. అయితే ఇంకా హీరోయిన్ గా ఎవరు కన్ఫామ్ కాలేదట. అందుకోసం ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారానే ఈ సినిమాలో కూడా తీసుకుంటే బాగుంటుందని టీమ్ అనుకుంటున్నారట. అంతేకాదు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్టుకు ఎస్ చెప్పాలా.. నో చెప్పాలా అనే సందిగ్ధంలో ఉందట. ఎందుకంటే కియారా అక్షర్ కుమార్ హీరోగా వస్తున్న ‘లక్ష్మీబాంబ్’, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్ భూలయ్య 2’లో నటిస్తోంది. ఫుల్ టైట్ షెడ్యూల్ ఉన్నా ఈ సినిమాను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదట కియారాకు. ఆల్ రెడీ మహేష్‌తో ఒకసారి నటించింది కావునా నో చెప్పదనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారట టీమ్. ఏం జరుగుతుందో చూద్దాం మరి.
- June 11, 2020
- Archive
- Top News
- సినిమా
- KIARA ADVANI
- MAHESHBABU
- పరుశరామ్
- బాలీవుడ్
- మహేష్ బాబు
- Comments Off on కియారా.. ఎస్.. నో