సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం జీడీకే 1, 2, 2 ఏ, 11 గని తదితర విభాగాల్లో సీఐటీయూతో పాటు వివిధ కార్మికసంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులను ఉత్పత్తి సాధనాలుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. కార్మికుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిరసన కార్యక్రమంలో కార్మికసంఘం నేతలు మల్లికార్జున్, పార్లపల్లి రవి, రాజశేఖర్, పీ భాస్కర్, ఎం మల్లేష్, కే ప్రసాద్, అనిల్, సాగర్, కిషన్, పల్లె శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రెడ్డి, వెంకటస్వామి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజు రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏం సారయ్య, ఆర్జీ వన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, శ్రీనివాసరావు, సత్తయ్య, మహేశ్, వీ రాములు, టీ సతీశ్, గజేంద్రర్, ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.