Breaking News

కార్మికుల రక్షణే ముఖ్యం

కార్మికుల రక్షణే ముఖ్యం.

సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి అనుమతి ఇవ్వడంతో అందులో పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలను పరిశీలించారు.

వారంతా సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ లు ధరించేలా చూడాలని సీపీ ఆదేశించారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రావు, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ తాపర్, జనరల్ మేనేజర్ బగ్గర్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.