Breaking News

‘కార్పొరేట్​’ ఆగడాలపై హైకోర్టు ఆగ్రహం

కార్పొరేట్​ ఆగ్రహాలపై హైకోర్టు సీరియస్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కార్పొరేట్​ ఆస్పత్రుల ఆగడాలపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి అధికచార్జీలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అపోలో, బసవతారకం కేన్సర్​ ఆస్పతులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని ఓ ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు. ఈ విషయంపై హైకోర్టు స్పందించింది. ఆయా కార్పొరేట్​ దవాఖానకు కేటాయించిన భూములను ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై తీరుపై వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించింది.