హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. మరోవైపు వీహెచ్‌ను ఇటీవల కలిసిన కాంగ్రెస్ నేతల్లో భయం నెలకొన్నది.