సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని 11వార్డు పాత పాలమూరు కౌన్సిలర్ ఎన్.శ్రీనివాసులు, 41వ వార్డు కౌన్సిలర్ రఫీయా అంజద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో శుక్రవారం చేరారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వారికి కండువా కపి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక రంగ అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కోరమొని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమొని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి పాల్గొన్నారు.
- May 29, 2020
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- CONGRESS
- MAHABUBNAGAR
- TRS
- పాలమూరు
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- Comments Off on కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి..