Breaking News

కాంగ్రెస్​ జలదీక్ష 13న..

CONGRESS

సారథి న్యూస్, రామడుగు: ఎగువ మానేరు ప్రాజెక్ట్​ త్వరగా పూర్తి చేయాలని 13 న టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జల దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని..రైతులను పెద్ద సంఖ్యలో తరలించాలని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా ఎగువ మానేరు పూర్తి చేయక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పంజాల శ్రీను, పులి ఆంజనేయులు, జెట్టుపల్లి వీరయ్య, శ్రీనివాస్ రెడ్డి, బాపి రాజ్, శేఖర్, కర్నె శ్రీను తదితరులు పాల్గొన్నారు.