Breaking News

కల తీరింది..

దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ మొదటి సినిమాతోనే యూత్ పల్స్ ని పట్టేసింది. తర్వాత ఆర్.డి.ఎక్స్‌ లవ్‌, వెంకీ మామ, డిస్కోరాజా చిత్రాల్లో నటించింది. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరో వైపు ఐటం సాంగ్స్ తోనూ ఆకట్టుకుంది.

ప్రెజెంట్ సీనియర్ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘నరేంద్ర’మూవీలో నటిస్తోంది పాయల్. భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు.. అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ‘నరేంద్ర’మూవీ తెరకెక్కుతోంది. తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలనే ఇప్పటికి తీరింది అంటోంది. ఇంత వరకూ ఆమెకు అలాంటి అవకాశం రాలేదు.. ఈ సినిమాతో తన ఆశ తీర్చుకుంది. ఆ విషయాన్ని స్వయంగా చెబుతూ డబ్బింగ్ చెబుతున్న ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఫ్యాన్స్తో తన ఆనందాన్ని పంచుకుంది. ఈ చిత్రంలో పాయల్ ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్‌గా కీలక పాత్రలో కనిపించనుంది.