సారథిన్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్ శర్మన్ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్కర్నూల్లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరారు. ఆర్డీవో కార్యాలయం, జెడ్పీ కార్యాలయం, ఎంపీడీవో, డీఈవో, ఎంఈవో, మహిళా సమాఖ్య భవనం, భవిత కేంద్ర కార్యాలయాలను సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను తనిఖీ చేశారు. కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు,
- July 23, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- INSPECTION
- NAGARKURNOOL
- నాగర్కర్నూల్
- సమయపాలన
- Comments Off on కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. షాకింగ్ నిజాలు