Breaking News

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా


బెంగళూరు: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్​ సీఎంలకు కరోనాకు అంటుకోగా, తాజాగా కాంగ్రెస్​ సీనియర్​ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్‌ చేశారు. సిద్ధరామయ్య ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఇదే ఆస్పత్రిలో సీఎం యడ్యూరప్ప కూడా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.