Breaking News

కరోనా @ 5,193

కరోనా @ 5,193

సారథి న్యూస్​, హైదారాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త 189 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,193కు చేరింది. తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 187 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 2,766 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రసుత్తం 2240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌ 2, రంగారెడ్డి 13, సంగారెడ్డి 2, వరంగల్‌ అర్బన్‌ 4, వరంగల్‌ రూరల్‌ 3, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ అధికారులు వెల్లడించారు.
మెదక్ జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం న‌మోదైంది. కరోనా వైరస్ సోకి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తూప్రాన్ పట్టణానికి చెందిన వ్యాపారి (63) సోమవారం మృతి చెందాడు. ఐదురోజుల క్రితం ఆయన కరోనా లక్షణాలతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అక్కడ టెస్ట్ నిర్వహించిన డాక్టర్లు కోవిడ్ -19 నిర్ధారణ అయినట్టు 13న వెల్లడించారు. దీంతో ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అతను సోమవారం మృతి చెందాడని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు తెలిపారు.