ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- July 18, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- DELHI
- INDIA
- NEWCASES
- కరోనా
- కొత్తకేసులు
- Comments Off on కరోనా విజృంభణ