సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్ఎంసీ పరిధిలో 1,658, రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్44, సంగారెడ్డి జిల్లాలో 20, వరంగల్రూరల్జిల్లాలో 41 చొప్పున కేసులు నమోదయ్యాయి.
- July 4, 2020
- Archive
- తెలంగాణ
- CARONA
- POSITIVE CASES
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కరోనా.. మజాకా