సారథి న్యూస్, కర్నూలు: కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వ్యక్తులు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని వైద్యాధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. గురువారం స్థానిక కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరిడెంటెంట్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డితో కలిసి సమీక్షించారు. కరోన బాధితులను హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా చూసి ఎప్పటికప్పుడు మందులు అందజేయాలని సూచించారు. అత్యవసరమైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలన్నారు. అడ్మిషన్, డేటా ఎంట్రీ, డైలీ డిశ్చార్జ్, డెత్ రెట్ తదితర వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు మెడికల్ కిట్ తో పాటు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ కిట్, క్వాలిటీ భోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్ కు సంబంధించి క్వాలిటీ ఉండే పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. జీజీహెచ్, విశ్వభారతి, శాంతిరాం హాస్పిటళ్లలో శానిటేషన్ సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలన్నారు.
- July 24, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- HYDERABAD
- ISOLATION
- KARONA
- కరోనా
- కలెక్టర్ వీరపాండియన్
- హైదరాబాద్
- Comments Off on కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి