Breaking News

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్.

లి మెంగ్​ యాన్​ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..
‘ కరోనా వైరస్​ మాంసం మార్కెట్​లో నుంచి వచ్చిందని చైనా చేస్తున్న ప్రచారమంతా అబద్ధం. ఈ వైరస్​ వూహాన్​లోని వైరాలజీ ల్యాబ్​లో తయారైంది. దీనిపై నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ వైరస్​పై సంబంధించి శాస్త్రవేత్తలు మాట్లాడకుండా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా గురించి చాలా విషయాలు బయటప్రపంచానికి చెప్పకుండా చైనా దాచిపెడతున్నది. కరోనా ప్రకృతిలోనుంచి పుట్టింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది జంతువుల నుంచి కూడా పుట్టలేదు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్​ వూహాన్​ ల్యాబ్​ నుంచే పట్టింది. ఈ వైరస్​ జన్యు శ్రేణిని నేను నిశితంగా పరిశీలించాను. ఎంతో అధ్యయనం చేశారు. అది మానవ వేలి ముద్రణ లాంటిది. దీని ఆధారంగా నేను కరోనా వైరస్​ మానవ నిర్మితమైందని నిరూపిస్తాను. ఏదన్నా వైరస్​లో హ్యూమన్​ ఫింగర్​ ప్రింట్​ ఉందంటే అది కచ్చితంగా మానవులు తయారుచేసిందే. నేను చెప్పేవన్నీ అబద్ధాలు అని ప్రచారం చేసేందుకు చైనా కుట్రలు పన్నుతుంది. నన్ను హత్య చేసేందుకు కూడా పన్నాగాలు రచిస్తుంది. ఏది ఏమైనా నేను ప్రపంచానికి నిజం చెబుతాను’ అని ఆమె పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్​పై సమగ్రంగా అధ్యయనం చేసిన వారిలో లి-మెంగ్​ కూడా ఒకరు. కాగా లి- మెంగ్​ ఆరోపణలను పలువురు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా ఖండించారు. ఆమె ఆధారాలు లేకండానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నదని ఆరోపించారు.