ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ద్వారానే కరోనాను అరికట్టవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ సరిగ్గా టెస్టులు చేయడం లేదు. కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695 కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,972 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 38,135 మంది ప్రాణాలు కోల్పోయారు. 5,79,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.