సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజాతో సమీక్షించారు. మార్చిన 2న రాష్ట్రంలో కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, వైద్యసిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల కోరారు.