సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదశ్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రికార్డు స్థాయిలో రోజుకు వందకుపైగా కేసు నమోదువుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నివారించాన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి రక్తనమునాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో కర్నూలులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా శ్యాంపిల్స్ సేకరించినట్లు ఆదివారం కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.
ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 2,451 కాగా, అందులో 1153 కేసు యాక్టివ్‌లో ఉన్నాయి. 1217 మంది డిశ్చార్జ్ కాగా 81 మంది మృతిచెందినట్లు అధికారిక లెక్కలె చెబుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాతో ప్రతి ఇంటికి వెళ్లి వైద్యసిబ్బంది రక్తనమునాలు సేకరించి పరీక్షలు జరిపారని, వైద్యాధికారులు, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, వార్డు సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బందిని కలెక్టర్ జి.వీరపాండియన్ అభినందించారు.