న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం నుంచి రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో పదకొండు వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానానికి వెళ్లనున్నది. త్వరలోనే యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87,403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా భారత్లో ఇదేస్థాయిలో కేసులు నమోదైతే యూకేను దాటేస్తామని అంచనా వేస్తున్నారు. కాగా భారత్లో మరణాలసంఖ్య తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యూకేలో ఇప్పటివరకు 40,579 మంది చనిపోగా.. మన దేశంలో 7,745 మంది మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 31వేలుకు చేరింది. మహారాష్ట్రలో 90వేల కేసులు నమోదయ్యాయి. వైరస్ పుట్టిన వూహాన్ను మహారాష్ట్ర దాటేసింది.మహారాష్ట్రలో 90,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,289 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. 42,638 మంది కోలుకున్నారు.తమిళనాడులో 34,914 పాజిటివ్ కేసులు నమోదు కాగా 307 మంది చనిపోయారు. 18,000 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో 31,309 వ్యాధి బారిన పడగా..11,861 మంది కోలుకున్నారు. 905 మంది చనిపోయారు. గుజరాత్లో బుధవారానికి 21,014 కేసులు పాజిటివ్ కేసులు ఉండగా.. 1313 మంది చనిపోయారు. 14,365 మంది కోలుకున్నారు. రాజస్థాన్లో 11,245 పాజిటివ్ కేసులు కాగా వారిలో 8,328 మంది కోలుకున్నారు. 255 మంది చనిపోయారు