న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్ రేట్ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని దీంతో ఇప్పటి వరకు టాప్ 6లో ఉన్న ఇటలీని మనం బీట్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఇటలీ కేసుల సంఖ్య 2,33,836. మన దేశంలో మరణాల రేటు ఇటలీ కంటే ఐదు రెట్లు తక్కువగా ఉంది. కరోనా కేసుల్లో యూఎస్ ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా.. బ్రెజిల్, రష్యా, యూకే, స్పెయిన్, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా మన దేశం ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉంది. మరణాల పరంగా 12వ ర్యాంక్‌లో ఉండగా.. కోలుకునే కేసులకు సంబంధించి 8వ స్థానంలో నిలిచింది.
- June 5, 2020
- Top News
- జాతీయం
- CAROONA
- INDIA
- ఇండియా
- గ్రోత్ రేట్
- భారత్
- Comments Off on కరోనా కేసుల్లో ఇటలీని మించి