సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- లోకల్ న్యూస్
- BJP
- CARONA
- TELANGANA
- TESTS
- TRS
- టీఆర్ఎస్
- తెలంగాణ
- Comments Off on కరోనా కట్టడిలో టీఆర్ఎస్ విఫలం