Breaking News

కరోనా ఎలా సోకిందో తెలియట్లేదు

SMITHA SINGER

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాప్ సింగర్ స్మిత, ఆమె భర్తకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్​లో వెల్లడించారు. ‘నిన్న ఎంతో ఇబ్బందికర రోజు. బాగా ఒళ్లు నొప్పులు అయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. పెద్దగా లక్షణాలు కనిపించలేదు. మేము చాలారోజుల నుంచి ఇంటి వద్దే ఉన్నాం.. అయినా కరోనా ఎలా సోకిందో అర్థం కావడం లేదు’ అని స్మిత ట్వీట్​ చేశారు.