సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది. శుక్రవారం 4,374 మందిని పరీక్షించగా 985 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు మొత్తంగా 12,349 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారిన పడి ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు 237 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 7,436 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చల్ జిల్లాలో 53, వరంగల్అర్బన్జిల్లాలో 20 పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యాయి.
- June 26, 2020
- Top News
- తెలంగాణ
- CARONA
- HYDERABAD
- TELANAGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కరోనా.. అంతకంతకు