సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్‌ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరినీ నిత్యం పేరుపేరునా పలకరించేవారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం ఆయన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయన మృతికి సంతాపం తెలిపారు.
- August 27, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- DEATH
- KARIMNAGAR
- MLA
- RAMADUGU
- SARPANCH
- కరీంనగర్
- కరోనా
- మృతి
- సర్పంచ్
- Comments Off on కరోనాతో సర్పంచ్ మృతి