Breaking News

కరోనాతో మంత్రి మృతి

మంత్రిని బలితీసుకున్న కరోనా

లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఓ మంత్రి కరోనాకు బలి కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా తన క్యాబినేట్​లోని మంత్రి మృతిచెందండంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్​ తన అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు. కమలా రాణి మృతికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు.