సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎన్ వీ రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
- July 30, 2020
- Archive
- ఖమ్మం
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- HYDERABAD
- KHAMMAM
- KTR
- కేటీఆర్
- ఖమ్మం
- మున్సిపాలిటీలు
- హైదరాబాద్
- Comments Off on కనీస వసతులపై దృష్టిపెట్టండి