సారథి న్యూస్, హైదరాబాద్ : కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆమె సంతోషంతో తిరిగి ఇంటికొచ్చింది.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంటికి వస్తే కొడుకు షాకిచ్చాడు.. ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. హైదరాబాద్ ఫిలింనగర్ బీజేఆర్ నగర్‌లో ఓ మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు. ఆమెను కుమారుడు, కోడలు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇంటిపై కప్పుకున్న రేకులు ధ్వంసం చేసి.. ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాపం ఆ మహిళ చేసేదేమీ లేక రోడ్డు పక్కనే బిక్కు బిక్కుమంటూ రాత్రంతా గడిపింది. ఆమెకు సహాయం అందించాలని పోలీసులకు ఫోన్ చేసినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు అంటున్నారు.
- July 26, 2020
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- CARONA
- FILMNAGAR
- HYDERABAD
- కరోనా
- ఫిలింనగర్
- హైదరాబాద్
- Comments Off on కనికరించని కన్నకొడుకు