![కత్తి మహేశ్ అరెస్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KATHI-2F.jpg?fit=677%2C452&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: వివాదాస్పద సినీ విమర్శకుడు, బిగ్‌బాస్ ఫేం కత్తి మహేశ్‌ను శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన ఫేస్బుక్లో శ్రీరాముడిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌పై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియాలో పరీక్షల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.