సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్ ఎల్ శర్మన్ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్వాక్చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్‌లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్‌కర్నూల్ పట్టణంలో మార్పులు తీసుకొస్తానని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఇతర సిబ్బంది ఉన్నారు.
- July 18, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- HYDERABAD
- NAGARKURNOOL
- SHARMAN
- కందనూలు
- నాగర్‌కర్నూల్
- Comments Off on కందనూలు రూపురేఖలు మార్చుదాం