కాన్పూర్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్ సమీపంలో పోలీసుల ఎన్కౌంటర్లో వికాస్‌దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్‌దూబే అరెస్టయ్యారు. అరెస్ట్‌కు కొద్దిగంటల ముందే వికాస్‌దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెబుతున్న వివరణ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. వికాస్‌దూబేను తీసుకొచ్చిన వాహనం.. పోలీసుల బోల్తాపడిందని చూపుతున్న వాహనం ఒకటి కాదంటూ కొందరు నెట్‌జన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతూ ట్వీట్‌చేశారు. మరోవైపు వికాస్‌దూబే సొంతగ్రామం బిక్రూలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పోలీసులను వికాస్‌దూబే అనుచరులు చంపితే యూపీలో రౌడీరాజ్యం నడుస్తోందని.. చేతకానీ సీఎం ఉన్నారని వ్యాఖ్యానించిన కొందరు నేతలు.. ఇప్పడు ఇలా మాట్లాడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నస్తున్నారు.
- July 10, 2020
- Archive
- Top News
- జాతీయం
- ENCOUNTER
- POLICE
- SOCIAL MEDIA
- TROLLS
- TWEETS
- UP
- వికాస్‌దూబే
- సోషల్‌మీడియా
- Comments Off on ఒక ఎన్కౌంటర్ ఎన్నోప్రశ్నలు