Breaking News

ఐలమ్మ ఆదర్శ మహిళ

సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు చేపట్టారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, రజక సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు సంగు స్వామి, నిజాంపేట గ్రామసర్పంచ్​ అనూష లక్ష్మీ నర్సింహులు, ఎంపీటీసీ హరికిష్టారెడ్డి, నిజాంపేట పీఏసీఎస్​ చైర్మన్ పప్పుల బాపురెడ్డి, కల్వకుంట పీఏసీఎస్​ సొసైటీ చైర్మన్, అందే కొండల్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ కొమ్మటబాబు, టీఆర్​ఎస్​ నాయకులు వై వెంకటేశం, లక్ష్మీ నర్సింహులు, షాదుల్, నిజాంపేట మాజీ సర్పంచ్ బజార్ తిరుమలగౌడ్, బుర్రసంతోష్ గౌడ్, నిజాంపేట రజక సంఘం నాయకులు, లింగం, దుబ్బ రాజయ్య, ఆప్కారి తిరుమలయ్య, రవీందర్, కుమార్, బాబు, కృష్ణ, శ్రీను, రమేశ్​ చిన్నరాజు, బాలయ్య, చేవెళ్ల ఎంపీటీసీ సున్నపు వసంతం, రజక అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ శర్వాలింగం, రజక సంఘాల జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై కృష్ణ, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగయ్య, శ్రీశైలం, వార్డు మెంబర్ గంగి యాదయ్య, ఎంపీటీసీ రాములు, జిల్లా సర్పంచుల సంఘము మాజీ అధ్యక్షుడు వీరేంధర్ రెడ్డి, నాయకులు ,వెంకటయ్య, పాండు, రాజేశ్​, ప్రశాంత్, నర్సింహులు, కృష్ణ, శివ కుమార్, శ్రీనివాస్, రవి, గిరి, కరుణాకర్, నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.