Breaking News

ఏ క్యారెక్టరైనా ఓకే

తన గెటప్స్​తో క్యారెక్టర్​కు ప్రాణం పోయడం కింగ్ నాగార్జున స్పెషాలిటీ. మేకోవర్ అవడంలో ఆయనకు ఆయనే సాటి. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులను ఎంపిక చేసుకునే కింగ్ ఈ సారి రైతుపాత్రను ఎంచుకున్నాడట. ఆల్​రెడీ ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాల్లో పంచె కట్టు కట్టి రైతుగా కనిపించినా ఈసారి మాత్రం పక్కా రైతుగా దర్శనమివ్వనున్నాడట అక్కినేని అందగాడు.

ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగార్జున పవర్​ ఫుల్​ ఎన్ఐఏ అధికారిగా కనిపించనున్నాడు. అయితే రీసెంట్​గా ‘గరుడవేగ’ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ నాగ్​కు ఓ కథ వినిపించాడట. వెంటనే అతని సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగార్జున. స్క్రిప్టు కూడా పక్కాగా రెడీ చేశాడట ప్రవీణ్. తప్పిపోయిన ఓ రైతు కూతురు కథ ఇది. తన కూతుర్ని ఎలా కనిపెట్టాడు, అందుకోసం ఎలాంటి సాహసం చేశాడు అన్నదే కథాంశంగా సాగుతుందట. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో అప్పుడే క్యూరియాసిటీ నెలకొంది. అందులోనే నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమా ఫస్ట్ లుక్ కూడా కొత్తదనంతో ఉండి అంచనాలు పెంచేది ఉండటంతో ఈ సినిమాపై కూడా అందరి దృష్టి పడుతోంది.