సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి 11వేల మార్క్ దాటింది. శుక్రవారం ఒకే రోజు 605 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారి కేసు 34, ఇతరదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,489కు చేరింది. యాక్టివ్ కేసులు 6,147కు చేరాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారు 5,196 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 146కు చేరింది.
ఇప్పటి వరకు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 1159, చిత్తూరు 725, తూర్పుగోదావరి 12, గుంటూరు 74, కడప 133, కృష్ణ 20, కర్నూలు 60, నెల్లూరు 15, ప్రకాశం 28, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 20, విజయనగరం 23, వెస్ట్ గోదావరి 79, ఇతర రాష్ట్రాల వారు 34, బయటి దేశం నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ గా నమోదైంది.