అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్)పై ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచింది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన మేరకు రెవెన్యూశాఖలో అధికారుల సాయంతో పారదర్శక సేవలు అందిస్తానన్నారు. భూ వివాదాల పరిష్కారానికి త్వరలో భూ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
- July 25, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AP GOVT
- CM JAGAN
- DARMANA
- INCOMECERTIFICATE
- KRISHNADAS
- ఆదాయ ధ్రువీకరణ
- ఏపీ ప్రభుత్వం
- ధర్మాన
- సీఎం జగన్
- Comments Off on ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం