అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కు చేరింది. తాజాగా, వ్యాధి బారినపడి 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,460 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,419 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,75,352కు చేరింది. గత 24 గంటల్లో 64,351 మందికి వైద్యపరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 33,56,852 టెస్టులు చేశారు.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 494, చిత్తూరు 967, ఈస్ట్‌గోదావరి 1,353, గుంటూరు 917, కడప 521, కృష్ణా 322, కర్నూలు 781, నెల్లూరు 949, ప్రకాశం 705, శ్రీకాకుళం 552, విశాఖపట్నం 846, విజయనగరం 667, వెస్ట్‌గోదావరి 853 చొప్పున పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.