అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 781, చిత్తూరు 1235, ఈస్ట్ గోదావరి 1,332, గుంటూరు 762, కడప 364, కృష్ణా 335, కర్నూలు 781, నెల్లూరు 723, ప్రకాశం 454, శ్రీకాకుళం 511, విశాఖపట్నం 797, విజయనగరం 593, వెస్ట్ గోదావరి 929 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.